టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త వీరంగం..

టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త వీరంగం..

హైదరాబాద్: ఉప్పల్ 7వ డివిజన్ చిలుకానగర్ లో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త బన్నాల ప్రవీణ్  నిన్న రాత్రి  తన అనుచరులతో కలసి రౌడీలా వీరంగం సృష్టించారు. చిలుకానగర్ లోని శ్రీనివాస హైట్స్ లోకి వెళ్లి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆవేశంలో తిట్టుకుంటూ.. బెదిరింపులకు పాల్పడుతూ వీరంగం సృష్టించిన వైనం పోలీసు కేసు దాకా వెళ్లింది. ప్రశాంతంగా ఉన్న కాలనీలో జరిగిన గొడవతో శ్రీనివాస హైట్స్ లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

శ్రీనివాస హైట్స్ లో నివాసముండే ఉండే బన్నాల ప్రవీణ్ కి సంబంధించిన వ్యక్తికి, కరెంటు సరఫరా బంద్ కావడంతో అందులోని అసోషియేషన్ వారు పట్టించుకోలేదంట. అతను నేరుగా వెళ్లి బన్నాల ప్రవీణ్ కి సమాచారం ఇవ్వడంతో తన అనుచరుడిని ఇలా ఇబ్బండిపెడతారా అంటూ.. అనుచరులతో కలసి శ్రీనివాస హైట్స్ కి వెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొద్దిసేపు తీవ్ర స్థాయిలో జరిగిన వాగ్వాదం చిన్నపాటి ఘర్షణకు దారితీసినట్లు చెబుతున్నారు. దాదాపు 11సంవత్సరాలుగా శ్రీనివాస హైట్స్ లో కుల మతాలకు అతీతంగా అందరూ కలసిమెలసి సంతోషంగా జీవనం సాగిస్తుండగా డివిజన్ తో సంబంధం లేని కార్పొరేటర్ భర్త రాత్రి వచ్చి రౌడీ వీరంగం సృష్జించడం సరి కాదని..  చాలా మంది భయాందోళనకు గురవుతున్నారని శ్రీనివాస హైట్స్ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా  ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.