Hydra: హామీ ఇచ్చారు.. అమలు చేశారు.. పీర్జాదిగూడలో ఆక్రమణల కూల్చివేత

Hydra: హామీ ఇచ్చారు.. అమలు చేశారు.. పీర్జాదిగూడలో ఆక్రమణల కూల్చివేత

బోడుప్పల్, పీర్జాదిగూడ పరిధిలో స్మశానాలు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను బుధవారం  (మే 21) హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వెంటనే యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అన్నట్లుగానే గురువారం ఉదయం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు.  పర్వతాపూర్ లోని కబ్జాకు గురైన స్మశాన వాటికలలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు.

పీర్జాదిగూడలో పరిధిలో స్మశాన వాటికలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు కొందరు వ్యక్తులు. సీలింగ్ ల్యాండ్ లో ఉన్న ముస్లిం, క్రిస్టియన్ లకు చెందిన స్మశాన వాటికల సర్వే నంబర్ లు 1, 10, 11 గల స్థలాలను కబ్జా దారులు ఆక్రమించి, అమ్మకాలు జరిపారు. కొందరు కొనుక్కొని నిర్మాణాలు చేపట్టి షటర్లలో బిజినెస్ చేస్తున్నారు. కొంత స్థలంలో పొజిషన్లో ఉన్నట్లు చూపడానికి కబ్జా దారులు రేకుల షెడ్ నిర్మాణాలు జరిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు గురువాంర కూల్చివేశారు. 

బుధవారం ఉదయం మేడిపల్లి లోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు.. గురువారం మేడిపల్లి పరిధిలోని పలు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. అందులో భాగంగాగత రెండేళ్లుగా కబ్జాకు గరైన స్మశాన వాటిక స్థలాలను స్థానికులకు అప్పగించారు.