V6 News

ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా

ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: దుండిగల్  గండిమైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లిలో  ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 120/1, 120/28 స‌‌‌‌ర్వే నంబ‌‌‌‌ర్లలో 4.15 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమి ఉండగా, కొందరు ఆక్రమణలకు ప్రయత్నిస్తుండగా, ఎప్పటిక‌‌‌‌ప్పుడు తొలగిస్తున్నారు. ఆ భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌‌‌‌ని కలెక్టర్​కోరగా, గురువారం ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టారు. 

అలాగే, జూబ్లీహిల్స్ ఏరియాలో పార్కు కోసం వదిలేసిన 1,600 గజాల స్థలాన్ని తప్పుడు కాగితాలతో కొట్టేయాలని చూసిన వారిని హైడ్రా అడ్డుకున్నది. వారిపై కేసులు నమోదు చేసి గురువారం స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ.45 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇబ్రహీంబాగ్‌‌‌‌ లో హైడ్రా కమిషనర్ 

చెరువులను బాగు చేసే పనులతో పాటు ఎస్ టీపీ కూడా పూర్తికావాలని, అప్పుడే మనం పడే కష్టానికి ఫలితం ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్​లో జరుగుతున్న చెరువు పునరుద్ధరణ పనులను గురువారం రంగనాథ్​పరిశీలించారు. ఈ సందర్భంగా జలమండలి అధికారులు 56 ఎంఎల్‌‌‌‌డీ సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మిస్తున్నట్లు కమిషనర్‌‌‌‌కు వివరించారు. 

చెరువు చుట్టూ పాత్‌‌‌‌వేలు కట్టాలని, ఇన్‌‌‌‌లెట్, ఔట్‌‌‌‌లెట్ల దగ్గర సైంటిఫిక్ పద్ధతులు వాడాలని సూచించారు. అంతకుముందు కొండాపూర్‌‌‌‌లోని కుడికుంట చెరువును కూడా కమిషనర్ సందర్శించారు. జల సంరక్షణ కోసం కృషి చేస్తున్న కల్పన రమేష్ (ది రైన్ వాటర్ ప్రాజెక్ట్) చొరవను ఆయన అభినందించారు.