రంగనాథ్ను తప్పించేందుకు కబ్జాదారుల కుట్రలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తాం

రంగనాథ్ను తప్పించేందుకు కబ్జాదారుల కుట్రలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తాం
  • స్పీక్​ అధ్యక్షుడు గోపాలన్  విద్యాసాగర్​

పంజాగుట్ట, వెలుగు: హైడ్రా కబ్జాదారుల నుంచి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించిందని, హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ పేదలకు న్యాయం చేస్తూ కబ్జాదారులకు సింహస్వప్నంగా మారారని ‘స్పీక్’ అధ్యక్షుడు ప్రొఫెసర్​ గోపాలన్ విద్యాసాగర్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ను పక్కన పెట్టాలని ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పుపై తమ సంస్థ అప్పీలుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారి పట్టించి హైడ్రాను బలహీనపరిచేందుకు కొందరు కబ్జాదారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నగరవ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, పార్కులు కబ్జాదారుల చెర నుంచి రక్షించిన ఘనత హైడ్రాదేనని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి సత్యనారాయణ, మారిశెట్టి మురళీకుమార్, దేవేందర్ యాదవ్, వరలక్ష్మి, వై.వెంకట నర్సింహారావు, జ్యోత్స్న, బ్రహ్మచారి  పాల్గొన్నారు.