నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నరు :హైడ్రా చీఫ్

నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నరు :హైడ్రా చీఫ్
  • ‘బతుకమ్మ కుంట’పై చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నం: హైడ్రా చీఫ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: బతుకమ్మ కుంట భూముల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం స్పందించారు. కుంట శాటిలైట్ డేటా, ఆధారాలను బహిర్గతం చేసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. 

ఈ లేఖపై రంగనాథ్ స్పందిస్తూ.. కేంద్రానికి వచ్చే ఇలాంటి ఫిర్యాదులను సాధారణ ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారన్నారు. ఈ కాపీలను కొందరు సోషల్ మీడియాలో పెట్టి, తనపై చర్యలు తీసుకోబోతున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.  బతుకమ్మ కుంట ప్రభుత్వ భూముల విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నామని తెలిపారు.