హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఒక నెల జైలు శిక్ష విధించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖండించారు.
తనపై ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని , కావాలనే కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు.
