గచ్చిబౌలిలో వాటర్ లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్ పై హైడ్రా సమీక్ష... కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు..

గచ్చిబౌలిలో వాటర్ లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్ పై హైడ్రా సమీక్ష... కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు..
  • ఐటీ కారిడార్ రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​ రోడ్లపై వర్షపు నీలవడంపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్, సైబరాబాద్​సీపీ రమేశ్​ బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్​కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సైబరాబాద్ సీపీ రమేష్ మాట్లాడుతూ.. వాటర్ లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కారణమవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంబంధిత శాఖలతో కలిసి నిరంతరం పర్యటించాలని సూచించారు. 

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. నాలాల్లో పేరుకుపోయిన పూడిక, ఆక్రమణలు, నీటి పారుదల మార్గాల్లో ఉన్న అడ్డంకులే వాటర్ లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రధాన కారణాలని తెలిపారు. అవసరమైన చోట్ల నాలాల విస్తరణ, డ్రైనేజీ మెరుగుదల పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.  

సీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో వర్షపు నీరు సక్రమంగా వెళ్లేలా అవసరమైన చోట్ల పైపుల ఏర్పాటుతోపాటు, నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న ప్రాంతాల్లో కటింగ్ పనులు, ఇతర ఇంజినీరింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.