అత్యాచార ఘటనపై ఆనంద్ మహీంద్రా ఘాటు ట్వీట్

అత్యాచార ఘటనపై ఆనంద్ మహీంద్రా ఘాటు ట్వీట్

ఆనంద్ మహీంద్రా.. వ్యాపారంలో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. పలు సృజన్మాతకమైన.. ఆలోచింప చేసే, స్పూర్తి నింపే వీడియోలను ఆయన పోస్టులు చేస్తుంటారు. అలాగే పలు ఘటనలపై ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. హైదరాబాద్ లో జరిగిన అత్యాచార ఘటనపై ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు. 

ఈ ఘటనకు సంబంధించి జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని కోట్ చేశారు ఆనంద్ మహీంద్రా. వాళ్లు పెట్టిన హెడ్డింగ్ సరైంది కాదన్నారు. యువకులు ఎవరో తనకు తెలియదు.. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదన్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకులు పలుకుబడి ఉన్న కుటుంబాల వారు కాదని..సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని దిగువ స్థాయి కుటుంబాల వారు అనడం సరైందన్నారు. అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్నారు. 

మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కోరారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని.. నిష్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న వార్త చూసి షాకయ్యానని అన్నారు. ఈ కేసులో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. 

మరిన్ని వార్తల కోసం : -

కేసీఆర్ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు


పోలీసులకు చిక్కిన వింత దొంగ.. ఒకే "కీ" తో 30 బైకులు చోరి..