హైదరాబాద్ లోని సనత్ నగర్ పరిధిలో గత కొద్ది రోజులుగా వరుస బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. బైక్ పోగోటుకున్నవారు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దొంగతనాలు ఒకే వ్యక్తి చేసినట్లు తెలిసింది. ఇక ఈ దొంగ ప్లాన్ చూస్తే తప్పక షాక్ అవ్వాల్సిందే.. ఈ దొంగ కాలనీలో ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను చోరీ చేసేందుకు మాస్టర్ ప్లాన్ చేశాడు. ఈ ఘరానా దొంగ ఒకే "కీ" తో 30 బైక్ లను ఓపెన్ చేసేందుకు వీలుగా ప్రణాళిక తయారు చేసుకున్నాడు. ఈ క్రమంలో ్ఓ రోజు అర్థరాత్రి 30 బైకుల తాళాలు ఓపెన్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అప్పటికే బైక్ ల దొంగ ఎవరాని వెతుకుతున్న స్థానికులకు అతడు ఆ వ్యాక్తి చిక్కడంతో బాగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారి కేసు నమోదు చేసి దొంగను విచారిస్తున్నారు.
