డిప్రెషన్ కు ఫ్రెండ్సే మందు.. వారితో మాట్లాడితే చాలు

డిప్రెషన్ కు ఫ్రెండ్సే మందు.. వారితో మాట్లాడితే చాలు
  • రోషిణి ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి స్వర్ణ, మానసిక వైద్య నిపుణులు బోనా కొలకో
  • లిటిల్‌‌‌‌‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

అబిడ్స్, వెలుగు: ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్న వారి మాటలను సానుభూతితో వినాలని, అవసరమైన సమయంలో వారికి అండగా నిలవాలని రోషిణి ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి స్వర్ణ, మానసిక వైద్య నిపుణులు బోనా కొలకో సూచించారు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌‌‌‌‌‌‌‌, ఒంటరితనం నుంచి బయటపడేందుకు తమ మనసులోని భావాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలని చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం అబిడ్స్‌‌‌‌‌‌‌‌లోని లిటిల్‌‌‌‌‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో రోషిణి ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

‘మనోధైర్యం.. బతకాలని సంకల్పం’ అనే సందేశంతో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 17 పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఆత్మహత్యల నివారణపై వీడియో మేకింగ్‌‌‌‌‌‌‌‌, వ్యాసరచన, పెయింటింగ్‌‌‌‌‌‌‌‌, డ్రాయింగ్‌‌‌‌‌‌‌‌ తదితర పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లిటిల్‌‌‌‌‌‌‌‌ ఫ్లవర్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆంటోనీ అవార్డులు అందజేశారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌.అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ విద్యాసంస్థల విద్యార్థులు పలు విభాగాల్లో అవార్డులు సాధించారు.