వికారాబాద్ పీఆర్ ఈఈ పరిధిలోకి ‘మర్పల్లి’..ఫలించిన అసెంబ్లీ స్పీకర్ కృషి

వికారాబాద్ పీఆర్ ఈఈ పరిధిలోకి ‘మర్పల్లి’..ఫలించిన అసెంబ్లీ స్పీకర్ కృషి

వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్ కృషితో తాండూర్​పీఆర్​ఈఈ కార్యాలయ పరిధిలో ఉన్న మర్పల్లి పీఆర్​సబ్​డివిజన్​ను వికారాబాద్​ఈఈ కార్యాలయ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

వికారాబాద్​అసెంబ్లీ పరిధిలో ఉన్న మర్పల్లి పీఆర్​సబ్​డివిజన్​తాండూర్​ పీఆర్​ఈఈ కార్యాలయంలో కొనసాగుతుండేది. దీంతో మర్పల్లి సబ్​డివిజన్​పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాండూర్​కు వెళ్లాల్సి రావడంతో ప్రజా ప్రతినిధులకు, కాంట్రాక్టర్లకు, అధికారులకు అసౌకర్యంగా ఉండేది. అసెంబ్లీ స్పీకర్​ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి, పరిష్కారానికి చొరవ చూపారు.