కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో గురువారం ఎస్జీఎఫ్మండల స్థాయి అండర్ 14, 17 బాలికల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్ పోటీలు ప్రారంభమైనట్లు విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని, వ్యక్తిత్వ వికాసం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్జిల్లా కార్యదర్శి బన్సీలాల్, మండల ఆర్గనైజింగ్ సెక్రటరి గిన్నె లక్ష్మణ్, ప్రిన్సిపాల్, టీచర్స్ కోచ్లు పాల్గొన్నారు.
