96 గదుల సత్రం నిర్మాణానికి సీఎం ఆమోదం : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

96 గదుల సత్రం నిర్మాణానికి సీఎం ఆమోదం : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టు, వెలుగు: ప్రముఖ దేవస్థానం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పెండింగ్​లో ఉన్న 96 గదుల సత్రం నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సత్యం కొండగట్టు సమస్యలను వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.35 కోట్ల టీటీడీ నిధులతో 96 గదుల సత్రం, రెండు వేల మందికి సరిపడా మాల విరమణ మండపం నిర్మాణానికి అప్పట్లో భూమిపూజ చేశారు. 

కానీ టెక్నికల్ సమస్యలతో బిల్డింగ్ నిర్మాణానికి నోచుకోలేదు. సమస్యను ఎమ్మెల్యే సత్యం సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిర్మాణానికి ఆయన ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ రెండు నిర్మాణాలతో ఏటా కొండగట్టుకు వచ్చే హనుమాన్ దీక్షాపరుల కష్టాలు తొలగనున్నాయి.