వాకౌట్‌‌పై బీజేఎల్పీలో  భిన్నాభిప్రాయాలు..ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ 

వాకౌట్‌‌పై బీజేఎల్పీలో  భిన్నాభిప్రాయాలు..ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ 

హైదరాబాద్‌‌, వెలుగు: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన గురువారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన ఏ వ్యూహంపై ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో భేటీ ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. 22ఏ అంశంపై మళ్లీ వాకౌట్ చేద్దామని కొందరు చెప్పగానే, కొందరు దీన్ని వ్యతిరేకించారు. సెన్సెస్ 2027తో పాటు సర్కారు పెట్టే ప్రతి అంశంపై చర్చలో పాల్గొని, బీజేపీ వైఖరిని చెప్పాలని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే మూడు రోజులు వాకౌట్ చేశామని, రోజూ ఇలాగే చేస్తే.. ప్రజల్లో చులకన అవుతామనే చర్చ జరిగినట్టు తెలిసింది. చర్చల్లో పాల్గొనకపోతే వన్‌‌సైడ్ ఆర్గుమెంట్ ప్రజల్లోకి వెళ్తుందని, అసెంబ్లీ నుంచి బీజేపీ పారిపోయిందనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దీనిని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో తుది నిర్ణయం తీసుకోకుండానే మీటింగ్ ముగిసింది.