సిరిసిల్ల టౌన్, వెలుగు: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ట్రైనింగ్‌కు సిరిసిల్ల యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపికయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తేజస్విన్వర్మ ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో శిక్షణకు ఎంపికయ్యారు.
ఈ మేరకు వీఎస్ఎస్సీ అధికారులు తేజస్విని వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. సిరిసిల్లకు చెందిన యువకుడు దేశంలోనే ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణకు ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.
