తహసీల్దార్ ఆఫీస్కు తాళం.. రెండేండ్లుగా అద్దె కట్టకపోవడంతో తాళం వేసిన ఓనర్

తహసీల్దార్ ఆఫీస్కు తాళం.. రెండేండ్లుగా అద్దె కట్టకపోవడంతో తాళం వేసిన ఓనర్

పాలకవీడు, వెలుగు: రెండేండ్లుగా రెంట్ చెల్లించకపోవడంతో బిల్డింగ్ ఓనర్ తహసీల్దార్ ఆఫీస్ కు తాళం వేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకవీడు తహసీల్దార్ ఆఫీస్ ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతోంది. ప్రతి నెల రూ. 13,800 రెంట్ చెల్లించాల్సి ఉంది.

రెండేండ్లుగా అద్దె కట్టకపోవడంతో భవన యజమాని పలుమార్లు ఆఫీసర్ల దృష్టకి తీసుకెళ్లాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో గురువారం ఉదయం ఆఫీస్ కు వచ్చి మెయిన్ డోర్ కు తాళం వేశాడు. దీంతో ఉద్యోగులు బయటే వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్... ఓనర్ తో మాట్లాడి త్వరలోనే అద్దె చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం తర్వాత తాళం తీశాడు.