వాషింగ్టన్ : 9/11 ఉగ్రదాడికి 25 ఏండ్లు..న్యూయార్క్‌‌‌‌లో 2,977 డ్రోన్‌‌‌‌లతో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి

వాషింగ్టన్ : 9/11 ఉగ్రదాడికి 25 ఏండ్లు..న్యూయార్క్‌‌‌‌లో 2,977 డ్రోన్‌‌‌‌లతో  ప్రాణాలు కోల్పోయిన వారికి  నివాళి

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడికి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా న్యూయార్క్ హార్బర్‌‌‌‌లో అత్యంత భావోద్వేగమైన దృశ్యం ఆవిష్కృతమైంది

2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌‌‌‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన 2,977 మంది జ్ఞాపకార్థం బుధవారం రాత్రి డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించారు. '2,977 లైట్స్ ఓవర్ న్యూయార్క్ హార్బర్' పేరుతో ఈ వినూత్న ప్రదర్శనలో  మొత్తం 2,977 డ్రోన్‌‌‌‌లను ఆకాశంలోకి ఎగురవేశారు.

 నాడు ప్రాణాలు కోల్పోయిన ఒక్కో బాధితుడికి జ్ఞాపకంగా ఒక్కో డ్రోన్‌‌‌‌ను ఉపయోగించారు. న్యూయార్క్ హార్బర్ ప్రాంతంలో తొలుత చక్కర్లు కొట్టిన వేలాది లైటింగ్ డ్రోన్లు.. కొద్దిసేపటికి క్రమంగా కదులుతూ ట్విన్ టవర్స్‌‌‌‌ ఆకారంలోకి మారాయి. రాత్రి వేళ కావడంతో ఆ వెలుగులు నిజమైన టవర్ల మాదిరిగా ప్రకాశిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. 

మాన్‌‌‌‌హాటన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన ప్రజలు నాటి విషాదాన్ని తలచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డ్రోన్ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నివాళి కార్యక్రమాన్ని సాంకేతికంగానే కాకుండా, బాధితులతో మమేకమై రూపొందించారు. 

9/11 దాడి నుంచి బయటపడినవారు, మృతుల కుటుంబ సభ్యులు, అలాగే ఆనాడు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టిన ఫస్ట్ రెస్పాండర్స్ (సిబ్బంది) సహకారంతో డ్రోన్ షోను తీర్చిదిద్దారు. కార్యక్రమంలో గతంలో ఫస్ట్ ఫస్ట్ రెస్పాండర్‌‌‌‌గా సేవలందించిన బ్రెండా బెర్క్‌‌‌‌మన్, టిమ్ బ్రౌన్.. 9/11 ఫ్యామిలీస్ యునైటెడ్ ప్రెసిడెంట్ టామ్ స్ట్రాడా భార్య టెర్రీ స్ట్రాడా, సెప్టెంబర్ 11న ప్రాణాలు కోల్పోయిన ఆఫీసర్ మోయిరా స్మిత్ భర్త జిమ్ స్మిత్, స్టీఫెన్ స్మిత్ కుమార్తె జెనెవియ్వి సిల్లర్ తదితరులు పాల్గొన్నారు.