మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద సాగుతున్న అంబులెన్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) అధ్యక్షుడు డా.ఎగ్గన శ్రీనివాస్, టీజీ ఎంసీ మెంబర్ డా.అనిల్ కుమార్ కో-ఆప్షన్ మెంబర్ డా.సంతోష్ కోరారు. గురువారం డీసీపీ భాస్కర్‌ను కలిసి కంప్లైంట్ చేశారు.
అంబులెన్స్ నిర్వాహకులు పాయింట్ సిస్టమ్ సిండికేట్‌గా ఏర్పడి పేద కుటుంబాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబులెన్స్‌లకు జీపీఎస్ ట్రాకింగ్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేయాలని, రోగులను వేధించి ఛార్జీలు వసూలు చేసే అంబులెన్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని కోరారు. హెచ్ఆర్డీఏ సెక్రటరీ, ట్రెజరర్ శ్రీధర్, ప్రవీణ్ కుమార్ సీనియర్ డాక్టర్లు రాకేష్, అభినవ్, ప్రసాద్, కుమార్ పాల్గొన్నారు.
