ఉట్నూర్‌‌‌‌‌‌‌‌ ఐటీడీఏలో మరుగోళ్ల పోటీలు

ఉట్నూర్‌‌‌‌‌‌‌‌ ఐటీడీఏలో మరుగోళ్ల పోటీలు

ఉట్నూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆదిలాబాద్​జిల్లా ఉట్నూర్​లోని ఐటీడీఏ ఇన్ చార్జ్ పీవో రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. పొలాల అమావాస్యను పురస్కరించుకుని సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో గురువారం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరుగోళ్ల పోటీలను ఆయన ప్రారంభించారు.  

ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల ఆచారాలు, పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గిరిజన భాషా, సంస్కృతుల పరిరక్షణకు ఐటీడీఏ విశేష కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఈఈ తానాజీ, డిప్యూటీ డీఈవో గోడం చందన్, గిరిజన క్రీడల అధికారి కె.పార్థసారథి, ఆదివాసీ కళాకారులు పాల్గొన్నారు.