ఆదిలాబాద్: నంబర్లు మార్చేస్తుండ్రు..చలాన్లు తప్పించుకునేందుకు ఎత్తుగడ

ఆదిలాబాద్: నంబర్లు మార్చేస్తుండ్రు..చలాన్లు తప్పించుకునేందుకు ఎత్తుగడ
  •     బైకులు, కార్లకు ఇతరుల వాహనాల నంబర్లు వాడుతున్న వైనం
  •     తమకు తెలియకుండానే చలాన్లు పడుతుండడంతో అవాక్కవుతున్న వాహనదారులు
  •     కమ్యునిటీ కాంటాక్ట్ లో భారీగా పట్టుబడుతున్న నకిలీ నంబర్లు 

ఫోటోలో కనిపిస్తున్న సీబీ షైన్ బైక్ కు ఉన్న నంబర్ ప్లేట్ వాస్తవానికి భీంపూర్ మండలంలోని గోనా గ్రామానికి చెందిన సయ్యద్ మోహిన్ కు చెందినది. ఈ బైక్ పై తాను జులై 3న సిరికొండ మండలంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లు ట్రాఫిక్ చలాన్ పడటంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఈ బైక్ పై తాను సిరికొండకు వెళ్లలేదని స్పష్టం చేశారు. చలాన్లు తప్పించుకునేందుకు సిరికొండ మండలంలోని దశ్నాపూర్ గూడకు చెందిన పచ్చుటే కృష్ణ తన బైక్ కు ఇతరుల వాహనాల నంబర్ ప్లేట్లు పెట్టుకొని వాడుతున్నట్లు .. పోలీసుల విచారణలో తేలగా అతడిని అరెస్ట్ చేశారు. 

ఆదిలాబాద్, వెలుగు : పోలీసుల ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు కొందరు ఇతరులను బలి చేస్తున్నారు. తమ వాహనాలకు వేరే వాహనాల నంబర్లు అమర్చి తిరుగుతున్నారు. సదరు వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించని సమయంలో పోలీసులు వేస్తున్న చలాన్లు అసలైన యజమానులకు వెళ్తుండడంతో వారు కంగుతింటున్నారు. తాను అటువైపే వెళ్లనప్పుడు తన వాహనానికి ఎలా చలాన్ వచ్చిందని విస్తుపోతున్నారు. ఇలా చలాన్లు పడ్డ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడుతోంది. 

ఎన్సీఆర్ సిస్టంతో గుట్టురట్టు

నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసేవారే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సీసీ కెమెరాలు, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ వ్యవస్థ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అనుమానాస్పద వాహనాలను గుర్తిస్తున్నారు. వాహనాలకు అమర్చిన నంబర్లను ఆటోమెటిక్ సిస్టం ద్వారా చాసిస్, ఇంజిన్ నంబర్లను పరిశీలించి నకిలీ నంబర్లు పెట్టుకున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కొందరు నంబర్ ప్లేట్లలోని అక్షరాలు, నంబర్లు మారుస్తుంటే.. మరికొందరు ఏకంగా నకిలీ నంబర్ ప్లేట్లు పెడుతున్నారు. వాటిని విక్రయించి అమాయకులను మోసం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిత్యం కమ్యునిటీ కాంటాక్ట్ పేరుతో తనిఖీలు చేస్తూ ఇలాంటి వాహనాలను పట్టుకుటున్నారు. ఇప్పటి వరకు 50 ఫేక్ నంబర్ల బైక్లు, రెండు