పీజీ ఈసెట్ సెకండ్ ఫేజ్లో 3,144 మందికి సీట్లు

పీజీ ఈసెట్ సెకండ్ ఫేజ్లో 3,144 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పీజీ ఈసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 3,617 సీట్లు అందుబాటులో ఉండగా.. 5,508 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 3,144 మందికి సీట్లు అలాట్ అయ్యాయని అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. మరోపక్క ఫస్ట్ ఫేజ్​లో 4,221 సీట్లు అలాట్ కాగా.. వారిలో 2,316 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్ట్ చేసినట్లు కన్వీనర్ వెల్లడించారు. రెండో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో ఫీజు చెల్లించి జాయినింగ్ రిపోర్ట్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ రిపోర్టులతో ఈ నెల 16 లోపు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని సూచించారు.