హైదరాబాద్, వెలుగు: గౌరవప్రదమైన శాసనసభను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్పార్టీ ఆరోపించింది. పార్టీకి లేని అంతర్జాతీయ కార్యదర్శి పదవిని సృష్టించి.. సంధ్యారావు అనే పేరిట నకిలీ ఎక్స్ ఖాతాలో కేసీఆర్ఆదేశాలతోనే శుద్ధీకరణ కార్యక్రమం చేశామని సభ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్పారని, కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు.
గురువారం ఈ మేరకు స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ఐటీ సెల్ వండివార్చిన నకిలీ ఎక్స్ ఖాతాలోని పోస్టును సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించడం తీవ్రమైనదన్నారు. పవిత్రమైన సభలో నకిలీ పేపర్లను ప్రదర్శించడం సభా హక్కుల ఉల్లంఘనే అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అసెంబ్లీ నియమావళి సెక్షన్168 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని చర్యలు తీసుకోవాలని కోరారు.
