టికెట్ రాలేదని.. ప్రచారం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి

టికెట్ రాలేదని.. ప్రచారం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి

55 మందితో  కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన 11 మందికి కూడా టికెట్లు దక్కించుకున్నారు. అంతేగాకుండా మైనంపల్లి హనుమంతరావు, ఉత్తమ్ కుమారెడ్డి ఫ్యామిలీలకు రెండేసి టికెట్లు దక్కాయి. అయితే  ఈ లిస్టులో  చాలా మంది సీనియర్లకు టికెట్ దక్కకపోవడం గమనార్హం. 

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న  షబ్బీర్ అలీకి,  సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్,    నాగం జనార్థన్ రెడ్డి, కొండా సురేఖ,ఇటీవల కాంగ్రెస్ లో చేరిన తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి  చాలా మందికి ఫస్ట్ లిస్టులో టికెట్ దక్కలేదు. దీంతో టికెట్ రాని ఆశావహులు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. 

Also Read :- సురేఖ దంపతుల దారెటు..? 

లేటెస్ట్ గా ఇబ్రహీం పట్నం టికెట్ ఆశించిన  మల్ రెడ్డి రంగారెడ్డికి ఫస్ట్ లిస్టులో  సీటు దక్కలేదు. దీంతో ఆయన  ప్రచారాన్ని ఆపేసి మధ్యలోనే వెళ్లిపోయారు.   ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ  6 గ్యారంటీ పథకాలు ఇంటింటికీ తీసుకొని వెళ్లే ప్రచార కార్యక్రమం మధ్యలోనే అపేసి వెళ్లిపోయారు  మల్ రెడ్డి రంగారెడ్డి. అప్పటి వరకు హుషారుగా కనిపించిని ఆయన టికెట్ రాలేదని తెలియడంతో ప్రచారాన్ని నిలిపివేసి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ అధిష్టానంపై సీరియస్ గా ఉన్నారు.