అక్టోబరు 17న ICC T20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. UAE, ఒమన్ వేదికల్లో జరిగే ఈ మెగా ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని ICC ఇవాళ(ఆదివారం) ప్రకటించింది. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు రూ.12.02 కోట్లు ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టుకు రూ.6 కోట్లు. సెమీఫైనల్లో ఓటమి పాలయ్యే జట్లకు రూ.3 కోట్ల చొప్పున నజరానా లభించనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.

