దుబాయ్: ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. ఐసీసీ విమెన్స్ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి (737) ఒక ప్లేస్ ఎగబాకి టాప్‌లో నిలిచింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో ఆమె ర్యాంకింగ్ పాయింట్లు మెరుగుపడ్డాయి.
దాంతో అప్పటివరకు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న అనాబెల్ సదర్లాండ్ (736) రెండో ర్యాంక్‌కు పడిపోయింది. పేసర్ అరుంధతి రెడ్డి (546) ఐదు స్థానాలు మెరుగై 36వ ర్యాంక్‌లో నిలిచింది. స్పిన్నర్ శ్రీచరణి (422).. 19 ప్లేస్‌లు ఎగబాకి 69వ ర్యాంక్‌ను సాధించింది. బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ (653) 14 నుంచి 9వ స్థానానికి చేరుకోగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (766) మూడో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది.
