- ఇడ్లీ వేణు అరెస్ట్
గోషామహల్, వెలుగు: బేగంబజార్లో ఆన్లైన్ క్రికెట్, రేస్ కోర్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ అలియాస్ ఇడ్లీ వేణు (59)ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 29న నారాయణ భవన్ సమీపంలోని ఆయన నివాసంపై పోలీసులు దాడి చేశారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ. 3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ‘గోదావరి అసోసియేట్స్’ పేరుతో వాట్సాప్ ద్వారా క్రికెట్, రేస్కోర్స్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. గతంలో పలు బెట్టింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇడ్లీ వేణు.. సాక్ష్యాలను చెరిపేసేందుకు వాట్సాప్ చాట్లను డిలీట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, శనివారం జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ బి. శ్రవణ్ కుమార్ తెలిపారు.
