తప్పు చేయకపోతే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎందుకు భయపడుతున్నాడని, అతను పెద్ద MVAకు నాయకుడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎద్దేవా చేశారు. ఈడీకి భయపడి తమ పార్టీలోకి రావొద్దని సూచించారు. సంజయ్ రౌత్ పై ఈడీ చేస్తున్న దాడులపై ఆయన స్పందించారు. అంతకుముందు కూడా ఈడీ సోదాలు జరిపిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈడీ పని చేస్తోందని విమర్శలు చేస్తున్నారని, దీనిపై సుప్రీం చర్యలు తీసుకోవచ్చాన్నారు. ఈడీ తన పని తాను చేసుకపోతోందన్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆయన కామెంట్స్ చేశారు. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. శాఖల కేటాయింపు విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు. డిప్యూటీ సీఎంతో కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
పాత్రా చాల్ ల్యాండ్ స్కామ్ లో సంజయ్ రౌత్ కు ఇప్పటికే రెండుసార్లు అధికారులు సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. జులై 20న ఈడీ సమన్లు పంపింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 7 తర్వాత మాత్రమే తాను హాజరవుతానని లాయర్ల ద్వారా తెలియజేశారు. సంజయ్ రౌత్ విచారణకు హాజరు కాకపోవడంతో ఆదివారం ఉదయం ఈడీ అధికారులు నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ దాడులపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ పగతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదని..కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు.
Allocation for ministries for state cabinet formation will be decided as soon as possible. We along with the Deputy CM are working on the growth of the state: Maha CM Eknath Shinde pic.twitter.com/SXNa5zUaS7
— ANI (@ANI) July 31, 2022
The investigation is underway. If he hasn't done anything wrong, why is he scared? He was a big MVA leader. Just because one's scared of the ED, one shouldn't come to our party: Maha CM Eknath Shinde on raids on Sanjay Raut pic.twitter.com/VHjuqhPywn
— ANI (@ANI) July 31, 2022
ED also conducted investigations earlier. If ED works under the fear of the Central govt then the Supreme Court should take action on this. ED is doing their work: Maha CM Eknath Shinde pic.twitter.com/FaQkqqrU2k
— ANI (@ANI) July 31, 2022
