
ముంబై: గాయం నుంచి కోలుకున్న టీమిం డియా ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా కాంపిటేటివ్ క్రికెట్ లో దుమ్ము దులుపుతున్నాడు. డివై పాటిల్ టీ20 కప్‌లో రిలయన్స్ వన్ టీమ్ కు ఆడుతున్న హార్దిక్(105, 5/26) మంగళవారం ఆల్ రౌండ్ షో చేశాడు. కాగ్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో 37 బాల్స్ ఎదుర్కొన్న హార్దిక్ 10 సిక్సర్లు, 7 ఫోర్లు బాది సెంచరీ పూర్తి చేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో కాగ్ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. బ్యాటింగ్‌లో పాండ్యా రెచ్చిపోవడంతో రిలయన్స్ టీమ్ 20ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 252 రన్స్ భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లోనూ హార్దిక్ సత్తా చాటడంతో భారీ ఛేజింగ్‌లో కాగ్ జట్టు 151 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది.