న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టును సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన టీమ్‌కు జమ్మూ కశ్మీర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కన్హయ్య వాధవాన్‌ను సారథ్యం వహించనున్నాడు. ఆయుష్ బదోనీని వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
గతంలో ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైనప్పటికీ గాయం కారణంగా అర్ష్‌దీప్ రెడ్‌బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేకపోయాడు. ఇటీవల రంజీ ట్రోఫీ నెగ్గిన జమ్మూ కశ్మీర్ జట్టు నుంచి ఆరుగురు ప్లేయర్లకు చాన్స్ ఇచ్చారు. కమ్రాన్ ఇక్బాల్, అబ్దుల్ సమద్, అబిద్ ముస్తాక్, సునీల్ కుమార్, యుధ్‌వీర్ సింగ్ ఇందులో ఉన్నారు. 41 ఏళ్ల సీనియర్ ప్లేయర్ పారస్ డోగ్రాకు చాన్స్ దక్కలేదు.
నార్త్ జోన్ జట్టు:
కన్హయ్య వాధవాన్ (కెప్టెన్), ఆయుశ్ బదోని (వైస్ కెప్టెన్), సనత్ సంగ్వాన్, కమ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుశ్ దోసేజా, అబ్దుల్ సమద్, నిశాంత్ సింధు, అర్జున్ శర్మ, ఆబిద్ ముస్తాక్, అర్షదీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కంబోజ్, యుధ్‌వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.
