న్యూఢిల్లీ, వెలుగు: సమగ్ర శిక్ష ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్య, మౌలిక వసతులు కల్పించినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. తెలంగాణలో మొత్తం 41,762 స్కూల్స్ ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 2,104, గ్రామీణ ప్రాంతాల్లో 7,753 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు.
పట్టణాల్లోని 4,939, గ్రామీణాల్లోని 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కువ అందుబాటులో ఉందని, పట్టణాల్లోని 3,917 స్కూల్స్, గ్రామాల్లో 15,535 పాఠశాలల్లో ఈ సౌకర్యం కల్పించినట్లు ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
