తమఊరిపొలిమేరల్లో వద్దని అడ్డుకున్నగ్రామస్థులు
రెండు గంటలపాటు అంబులెన్స్ లోనే డెడ్ బాడీ
వేములవాడ, వెలుగు: కరోనాతో మృతిచెందిన వ్యక్తిని దహనం చేయడానికి అంబులెన్స్ లో తీసుకెళ్లగా తమ గ్రామ పొలిమేర్లలో వద్దంటూ ఆయా గ్రామాలవారు అడ్డుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వీధిలో నివాసం ఉండే వ్యక్తికి నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికి ఎవరి నుంచి సోకిందనే విషయం మాత్రం తెలియలేదు. అధికారులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించి ట్రీట్ మెంట్ చేశారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా దగ్గు, దమ్ము రావడంతో వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు.
అతనికి కోవిడ్ రూల్స్ ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు మంగళవారం తెట్టెకుం ట సమీపంలోని మున్సి పల్ డంపింగ్ యార్డుకి తీసుకెళ్లగా అక్కడ గ్రామస్థులు అడ్డుకున్నారు. శభాష్ పల్లి, కొడుముంజ గ్రామ శ్మశానవాటికల్లో ప్రయత్నించగా అక్కడా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక నాం పల్లి వద్దరోడ్ పై అంబులెన్స్ నిలిపి రెండు గంటలపాటు అక్కడే ఉండిపోయారు. చివరకు గతంలో వేములవాడ పట్టణంలో ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందగా ఎక్కడైతే దహనం చేశారో అదే ప్రాంతంలో మూలవాగులో పో లీసులు, వైద్యాధికారుల సమక్షంలో కోవిడ్ రూల్స్ ప్రకారం దహనం చేశారు.

