దానిమ్మ జ్యూస్ తో రోగ నిరోధక శక్తి

దానిమ్మ జ్యూస్ తో రోగ నిరోధక శక్తి

సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. శరీరానికి ఉత్తేజాన్నిచ్చేగుణాలతో పాటు ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు కూడా దానిమ్మ పండ్లలో ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రతి రోజు ఉదయాన్నే గ్లాస్ దానిమ్మ పండ్ల జ్యూస్‌‌ తాగితే కలిగే లాభాలివి..దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పరగడుపునే దానిమ్మ జ్యూస్‌‌ తాగితే శరీరంలో ఉండే ఇన్‌ ఫెక్షన్లు త్వరగా తగ్గు తాయి. ఈ జ్యూస్ సహజమైన యాస్పిరిన్‌ లా పనిచేస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. దానిమ్మ జ్యూస్‌‌ను రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రా ల్ తగ్గు తుంది.మలబద్దకం, అజీర్ణం సమస్యలు పోతాయి. విరేచనాలు తగ్గుతాయి. గొంతు ఇన్‌ ఫెక్షన్, నొప్పి తగ్గు తుంది. దానిమ్మపండ్ల జ్యూస్‌‌ను వరుసగా 15 నుం చి 20 రోజుల పాటు తాగితే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలు పోతాయి. రక్తం వృద్ధి చెందుతుంది.