IPL 2026: గుజరాత్‌ను చిత్తు చేసిన  రవి బిష్ణోయ్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం 

IPL 2026: గుజరాత్‌ను చిత్తు చేసిన  రవి బిష్ణోయ్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం 

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో కేవలం 6 పరుగుల తేడాతోనే రాజస్థాన్ గెలిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కి అద్భుతమైన ఆరంభం లభించింది. బ్యాటింగ్ లో ధృవ్ జురెల్, జైస్వాల్ సూపర్బ్ హాఫ్ సెంచరీలతో పాటు వైభన్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ చేయగా, రవి బిష్ణోయ్ వైల్డ్ ఫైర్ బౌలింగ్ తో గుజరాత్ జట్టు ఓటమిని శాసించాడు. 

దీంతో 211 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ జట్టుకి ఓపెనర్లు సాయి సుదర్శన్,  కుమార్ కుశాగ్ర మంచి ఆరంభం అందించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 78 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కుశాగ్ర (18)ని ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ (7.5)లో బౌండరీ లైన్ వద్ద షిమ్రాన్ హెట్‌మయర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఇక సాయి సుదర్శన్ ( 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 73 పరుగులు) అర్థ శతకంతో వీరావిహారం చేస్తుండగా.. రవి బిష్ణోయ్ (10.4) అతడ్ని పెవిలియన్ కి పంపించాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 3 పరుగులు చేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్ (12.1) లోనే అవుట్ కాగా, ఆ తర్వాత బంతికి ఫోర్ వాషింగ్టన్ సుందర్ ఆ నెక్ట్స్ బాల్ (12.3 ఓవర్)కి మైదానం వీడాడు. 

మరోవైపు జోస్ బట్లర్ ( 14 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు) కూడా కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ, నాండ్రే బర్గర్ బౌలింగ్ (13.1)లో సందీప్ శర్మకి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోగానే.. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన రాహుల్ తెవాటియా (12) కూడా మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌ (14.3)లో ధృవ్ జురెల్ కి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే షారుఖ్ ఖాన్ (11) కూడా మూడో పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన రషీద్ ఖాన్, కగిసో రబాడా గుజరాత్ టైటాన్స్ కి విజయాన్ని అందించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు.

కానీ చివరి ఓవర్లో 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితులో తుషార్ దేశ్ పాండే అద్భుతమైన బౌలింగ్ తో రషీద్ ఖాన్ (24)ని ఔట్ చేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి మ్యాచ్ ని లాగేసుకున్నాడు.  రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటమిని శాసించగా.. రియాన్ పరాగ్, నాండ్రే బర్గర్, దేశ్ పాండే తలో వికెట్ తీసుకున్నారు.