సీఈసీపై అభిశంసన చర్యలు చేపడతం: టీఎంసీ

సీఈసీపై అభిశంసన చర్యలు చేపడతం: టీఎంసీ

కోల్​కతా: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై అభిశంసన చర్యలు చేపట్టేందుకు రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఓటర్ల జాబితాను సంస్కరించేందుకు ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను చేపట్టింది. అయితే ఈ ‘సర్’ ​ప్రక్రియ మొత్తం తప్పుగా, లోపభూయిష్టంగా జరుగుతున్నదని బెంగాల్​సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. 

టీఎంసీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సుమారు 40 వేల నుంచి ఒక లక్ష మంది ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని ఆమె అంటున్నారు. బీజేపీ నియోజకవర్గాల్లో కేవలం 3-4 వేల మంది పేర్లు మాత్రమే తొలగిస్తున్నారని చెప్తున్నారు. బబనీపూర్ నియోజకవర్గంలో 40 వేల మంది పేర్లు తొలగించారని, ఇక్కడ లక్ష మందిని ఓటర్​లిస్ట్​నుంచి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.