అలర్ట్‌.. ఇరిగేషన్ శాఖ కీలక ఆదేశాలు : ఆఫీసర్లు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లొద్దు

అలర్ట్‌.. ఇరిగేషన్ శాఖ కీలక ఆదేశాలు : ఆఫీసర్లు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లొద్దు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు  IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు -నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయం నుంచి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటన విడుదల చేసింది. నీటి పారుదల శాఖాధికారులు ఎవ్వరూ సెలవులు పెట్టొదని సూచించింది. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లను, చెరువులను మానిటరింగ్ చెయ్యాలని, నీటి స్థాయిలను పర్య వేక్షించండని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పంపంది ఆ శాఖ.

ఓవర్ ఫ్లో నిరోధించడానికి గేట్లు, స్పిల్ వేలను పరిశీలించాలని, డ్యామ్ లు, కట్టలు, కెనాల్ లను తనిఖీలు నిర్వహించాలని అధికారులను -నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదం సంభవిస్తుందన్న అనుమానస్పద ప్రాంతంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపత్తులు గుర్తించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా స్పందించాలని కోరారు.