8నెలల గర్భవతికి కరోనా లక్షణాలు..ట్రీట్మెంట్ ఇవ్వని 8 ఆస్పత్రులు..చివరికి

8నెలల గర్భవతికి కరోనా లక్షణాలు..ట్రీట్మెంట్ ఇవ్వని 8 ఆస్పత్రులు..చివరికి

సాధారణంగా వరుడు కావలెను, వధువు కావాలి అంటూ పేపర్లలో వచ్చే అడ్వటైజ్ మెంట్లను చూసే ఉంటాం. కానీ ప్రస్తుతం ఈ కరోనా టైంలో కాస్త మానవత్వం కావలెను అనే పదం బాగా వినబడుతోంది.

కరోనా వైరస్ లక్షణాలున్నా..కరోనా సోకిన బాధితులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు సైతం తిరస్కరిస్తున్నాయి. అలా తిరస్కరించినందు వల్లే 8నెలల గర్భిణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఢిల్లీ నోయిడా కు చెందిన నీలం, విజయేందర్ భార్య భర్తలు. గర్భిణీ గా ఉన్న నీలం అనారోగ్యానికి గురికావడంతో అత్యవసర చికిత్స కోసం  భర్త విజయేందర్ స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో జాయిన్ చేయించాడు. నీలంకు  ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని, ట్రీట్ మెంట్ కొనసాగించేందుకు తిరస్కరించారు. దీంతో ఆందోళనకు గురైన విజయ్ తన భార్య నీలం కు ట్రీట్ మెంట్ ఇప్పించేందుకు 13గంటల పాటు ప్రైవేట్ తో పాటు గవర్నమెంట్ కు చెందిన  8 ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. అందులో కరోనా లక్షణాలుంటే ట్రీట్ మెంట్ ఇవ్వమని, మరో ఆస్పత్రిలో బెడ్ లు లేవంటూ గర్భిణీ నీలం ను ఆస్పత్రిలో జాయిన్ చేయించుకునేందుకు తిరస్కరించారు. చివరికి ట్రీట్ మెంట్ అందక తన భార్య చనిపోయిందని గర్భిణీ నీలం భర్త విజయేందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇండియా టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.