కంపెనీల ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో మహిళలను కూడా తప్పనిసరిగా ఉండేలా జర్మనీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నత హోదాల్లో లింగ వివక్షను రూపుమాపేందుకు స్వచ్ఛందంగా చేపట్టాల్సిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత జర్మనీ సంకీర్ణ ప్రభుత్వం బుధవారం ఒక కొత్త బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం లిస్టెడ్ కంపెనీలు ఇకపై తమ ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో మహిళలను తప్పనిసరి భాగస్వాములను చేయాల్సి వుంటుంది.
నలుగురు అంతకుమించి ఎక్కువ ఎగ్జిక్యూటివ్‌లు ఉండే లిస్టెడ్ కంపెనీలు కనీసం ఒక మహిళను బోర్డు సభ్యురాలిగా నియమించాల్సి ఉంటుంది.
జర్మనీలో మహిళ సగటు ఆదాయం కూడా పురుషులతో పోల్చుకుంటే 20 శాతం తక్కువగా ఉంది. దీంతో ఉన్నత హోదాల్లో లింగ వివక్షను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఈ సరికొత్త చట్టాన్ని రూపొందించింది. అంతేకాదు మేనేజ్ మెంట్ బోర్డుల్లో మహిళలు తప్పని సరిగా ఉండాలంటూ బిల్లుకు గ్రీన్ సిగ్నలిచ్చింది.
