జాతీయ జెండా గౌరవమేంటో శరణార్థులను అడిగి తెలుసుకోండి

జాతీయ జెండా గౌరవమేంటో శరణార్థులను అడిగి తెలుసుకోండి

శ్రీనగర్: దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థుల నుంచి భారత జాతీయ పతాక గౌరవం గురించి తెలుసుకోవాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. జమ్మూ కశ్మీర్‌‌లో డీడీసీ లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్వహించిన ప్రచారంలో స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే దాకా భారత్ జెండాను ఎగురవేయబోమని పీడీపీ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా చేసిన వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ స్పందించారు. ‘గుప్కర్ గ్యాంగ్ అధికారంలో ఉన్నప్పుడు శరణార్థులకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించలేదు. కానీ దేశ విభజన సమయంలో భారత్ వైపు నిలబడ్డ శరణార్థుల కుటుంబాల మనసును ప్రధాని మోడీ అర్థం చేసుకున్నారు. పాకిస్తాన్‌‌ను గాక భారత్‌‌ను ఎంచుకున్న వారికి అధికారం దక్కాలని, అందుకే వారికి ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వాలని మోడీ నిర్ణయించారు’ అని స్మృతి పేర్కొన్నారు.