వామ్మో ..ఇదెక్కడి ఆచారంరా బాబూ.. కత్తుల నిచ్చెన ఎక్కి దేవతను ప్రార్థిస్తారు..

వామ్మో ..ఇదెక్కడి ఆచారంరా బాబూ.. కత్తుల నిచ్చెన ఎక్కి దేవతను ప్రార్థిస్తారు..

ప్రతి దేవాలయానికి ఒక ఆచారం ఉంటుంది.  ప్రతి గ్రామానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.  తమిళనాడులో ఆచారాలు, సంప్రదాయాలు కాస్త ఎక్కువుగా ఉంటాయి.  ఒక్కో ఉత్సవం ఒక్కో రకంగా జరుగుతుంది.  జల్లికట్టు... నిప్పుల గుండం ఇలా అనేక రకాలుగా పలు దేవాలయాల్లో సంస్కృతీ సంప్రదాయాలు ఉంటాయి.  తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని తిరుకలుకుండ్రంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు.

తమిళనాడులో చెంగల్ పట్ లోని తిరుకలుకుండ్రంలోని శ్రీ ముత్తు మరియమ్మన్ ఆలయ వార్షికోత్సవాల్లో కత్తుల నిచ్చెన ఎక్కి తమ భక్తిని చాటుకుంటారు.  తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడాలేవు.  అక్కడ  ఆచారాలు.. సంప్రదాయాలు కూడా వినూత్నంగానే ఉంటాయి.  ఏ దేవాలయం ఆచారాలు ఆ దేవాలయానికే పరిమితమవుతాయి.  ఏ వూరి కట్టుబాట్లు ఆ గ్రామానికే పరిమితమవుతాయి.  తమిళనాడులోని చెంగల్ పట్ దేవాలయంలో శ్రీ ముత్తు మరియమ్మన్ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో  దేవత అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు.  

ALSO READ :ఫ్లోరిడా సిటీని వదిలి వెళ్లిపోండి.. తుఫాన్ విధ్వంసంపై అలర్ట్

తమిళనాడు చెంగల్ పట్ లోని తిరుకలుకుండ్రంలోని శ్రీ ముత్తు మరియమ్మన్ ఆలయంలో 14వ వార్షిక ఉత్సవాలు వైభవంగా  జరిగాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు.  ఈ ఉత్సవంలో  ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంస్కృతికి ఒక ఆచారం ఉంటుంది.  భక్తులు కత్తుల నిచ్చెన ఎక్కుతారు.  నిచ్చెన ఎక్కేటప్పుడు దేవతను ప్రార్థిస్తూ ఎక్కుతారు. ఈ నిచ్చెనకు మొత్తం 11 మెట్లు ఉంటాయి.  11 వ మెట్టు వద్దకు చేరుకోగానే తల వంచుకొని .. అక్కడి నుంచి పూలు, స్వీట్లు, పండ్లు ప్రజలవైపు విసురుతారు.  కిందనుంచి ఒక తాడుతో పూలు, స్వీట్లు పైకి పంపిస్తారు. అక్కడ దేవతను స్మరించుకొని దేవతకు నివేదించి భక్తులకు విసురుతారు.  ఆ ప్రసాదం దొరికిన వారు అదృష్ట వంతులుగా చెప్పబడతారు.  ప్రజలు తమ భక్తిని అనేక మార్గాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు.     కొంతమంది ఉపవాసం ఉంటే... మరికొందరు  తీర్దయాత్రలు చేసి తమ భక్తిని చాటుకుంటారు.