
- విద్యా వాలంటీర్లతోనే టీచింగ్
టీచర్ పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (టీఆర్ టీ) నిర్వహించిఏడాది దాటినా , ఇప్పటికీ ఒక్కపోస్టు కూడా భర్తీకాలేదు. కనీసం రిజల్ట్స్ ఇచ్చిన పోస్టులను భర్తీచేసేందుకూ సర్కారు సిద్ధంగా లేదు. ‘తెలంగాణ’ప్రభుత్వం వచ్చిన తర్వా త బడుల్లో ఒక్క టీచర్‌పోస్టు కూడా భర్తీ చేయకపోవడం గమనార్హం. మరోపక్క వచ్చే విద్యా సంవత్సరానికి వాలంటీర్లను నియమించే పనిలో పాఠశాల విద్యాశాఖనిమగ్నమైంది. నోటిఫికేషన్లకే పరిమితం2017 అక్టోబర్ 22న 8,792 టీచర్ పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018ఫిబ్రవరి 24 నుంచి మార్చి4 వరకు పరీక్షలు నిర్వహించింది. తర్వా త ఒక్కో సబ్జెక్టు కు సంబంధించి నరిజల్ట్స్ విడుదల చేస్తూ వచ్చింది. కొన్ని ఫలితాలుకోర్టు కేసులతో ఆలస్యమయ్యాయి. ఇప్పటి వరకు7,485 పోస్టుల ఫలితాలను విడుదల చేయగా,మరో 1,307 పోస్టుల ఫలితాలు పెండిం గ్ లోఉన్నాయి. అయితే రిజల్ట్స్ విడుదల చేస్తు న్న వాటినికూడా భర్తీ చేయడం లేదు.3,900 పోస్టుల భర్తీకి యత్నం సుమారు3,900 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభిం చింది. దీనికి సంబంధించిగైడ్ లైన్స్, రోస్టర్ పాయింట్స్, ఎక్కడెక్కడ ఖాళీలు…తదితర అంశాలతో సర్కారుకు ఫైల్ పెట్టింది. నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి ఎలాంటిస్పందన రావడం లేదు.వాలంటీర్ల భర్తీకి చర్యలువచ్చే విద్యా సంవత్సరానికి బడుల్లో వాలంటీర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలుచేపట్టింది. గతేడాది సుమారు 16 వేల మందినినియమిం చగా, 2019–20లో ఎంతమంది అవసరమనే లెక్కలను సేకరించింది. సుమారు22 వేల మంది కావాలని డీఈవోలు ప్రతిపాదనలు పంపిం చారు. దీని బట్టి చూస్తే ఇప్పట్లో టీచర్‌పోస్టుల భర్తీ జరిగేలా కనిపించడం లేదు.