ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా ఢీ

ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా ఢీ

భువనేశ్వర్: ఫిఫా 2026 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్ కఠిన సవాల్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది. మంగళవారం జరిగే తమ రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌, బలమైన ఖతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 

నాలుగేండ్ల కిందట 2022 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ సెకండ్ రౌండ్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆ టీమ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను 0–0తో డ్రా చేసుకున్న  ఇండియా ఆ స్ఫూర్తితో ఈ సారి కూడా సత్తా చాటాలని ఆశిస్తోంది. ఈ నెల 16న జరిగిన గ్రూప్ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 1–0తో కువైట్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది.