'థ్యాంక్ గాడ్'పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత

'థ్యాంక్ గాడ్'పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత

అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫిల్మ్ థ్యాంక్ గాడ్. ఇంద్రకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మైథలాజికల్, పునర్జన్మ, స్వర్గం-నరకం అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ కామెడీ సినిమాకు దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. అయితే ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకోగా.. అదే స్థాయిలో వివాదాలనూ మూటగట్టుకుంటోంది. ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగ థ్యాంక్ గాడ్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు. హిందూ దేవుళ్లను అనుచితంగా ప్రదర్శించారని, హిందూ మతాన్ని అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా చిత్రీకరణ జరుపుకుందన్నారు. ఇదిలా ఉండగా థ్యాంకూ గాడ్ సినిమాలో అజయ్ దేవ్ గణ్ ఓ మోడర్న్ చిత్రగుప్తుడిగా నటించాడు. బూట్లు వేసుకొని, కూలింగ్ గ్లాసెస్, ఇయర్ రింగ్స్ తో స్టైలిష్ గా కనిపించాడు. యమదూతలు సైతం అదే పంథాను సాగిస్తూ కనిపిస్తారు. దీంతో ఈ సినిమాని హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా తీశారని వాదనలు తలెత్తుతున్నాయి.