మస్తు పెరిగిన మాల్స్​ లీజింగ్

మస్తు పెరిగిన మాల్స్​ లీజింగ్

న్యూఢిల్లీ: మనదేశంలో టాప్​–8 సిటీల్లో లగ్జరీ షాపింగ్​ మాల్స్​, స్ట్రీట్స్​లో ఆస్తుల లీజింగ్​ పోయిన సంవత్సరం 21 శాతం పెరిగి 47 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. రియల్టర్లు తమ బిజినెస్​ను పెంచుకోవడానికి కొత్త షాపులను తెరవడమే ఇందుకు కారణమని ప్రాపర్టీ కన్సల్టంట్​ సీబీఆర్​ఈ తెలిపింది. దీని రిపోర్ట్​ ప్రకారం.. 2021లో ఈ నగరాల్లో 39 లక్షల చదరపు అడుగుల జాగా అమ్ముడయింది. ‘‘ఇండియా రిటైల్​ సెక్టార్ ​పుంజుకుంటున్నది. ఈ సంవత్సరం ఇది మరింత ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం. గ్లోబల్​ మార్కెట్లలో పరిస్థితులు బాగా లేకున్నా ఇంటర్నేషనల్​ బ్రాండ్లు మనదేశంలో పెద్ద ఎత్తున స్టోర్లను తెరుస్తున్నాయి. ఇక్కడ డిమాండ్​ బాగా ఉండటమే కారణం” అని సీబీఆర్​ఈ చైర్మన్​ అన్షుమన్ ​అన్నారు. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో రిటైల్ స్థలాల లీజు 2021లో 0.03 మిలియన్ చదరపు అడుగుల నుంచి గతేడాది 0.10 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. బెంగళూరులో, రిటైల్ జాగా అమ్మకం 1.68 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.92 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. చెన్నైలో ఇది 0.26 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.45 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఢిల్లీ–-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో లీజింగ్ 0.36 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.96 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.పూణే 2021 సంవత్సరంలో లీజింగ్​ 0.19 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.43 మిలియన్ చదరపు అడుగులకు ఎగిసింది.  కోల్‌‌‌‌‌‌‌‌కతాలో ఇది 0.10 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.18 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఇదేకాలంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 0.64 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.31 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ముంబైలో రిటైల్ స్థలం అమ్మకం 0.66 మిలియన్ చదరపు అడుగుల నుంచి 0.39 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.

కరోనా తగ్గడంతో షాపులు కళకళ...

సీబీఆర్​ఈ ఇండియా ఎండీ రామ్​చంద్​నానీ మాట్లాడుతూ కరోనా రిస్ట్రిక్షన్లు పూర్తిగా తొలగిపోయిన తరువాత షాపర్లు పెద్ద ఎత్తున రిటైల్​ స్టోర్లకు వస్తున్నారని తెలిపారు.  అందుకే 2022 జూలై–డిసెంబరు మధ్య అమ్మకాలు కరోనా ముందుస్థాయికి చేరాయని వివరించారు. కరోనా తరువాత ఎన్నో గ్లోబల్​ బ్రాండ్లు ఇండియా బాట పట్టాయని ఇండియా సోథ్బేస్​ ఇంటర్నేషనల్​ రియల్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ గగన్​ రామ్​దేవ్​ చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్లు టిమ్ హోర్టన్స్, విక్టోరియాస్ సీక్రెట్, యునిక్లో పోయిన ఏడాది విస్తరించాయి. యునిక్లో తన మొదటి దుకాణాన్ని చండీగఢ్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించింది. టిమ్ హార్టన్స్ లుథియానాకు వెళ్లింది.  స్టార్‌‌‌‌‌‌‌‌బక్స్, బిబా, షాపర్స్ స్టాప్ స్టోర్లు డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమయ్యాయి. 2022లో అమెరికన్ హోం అప్లయెన్సెస్​ కంపెనీ పాటరీ బార్న్ ఢిల్లీలో రెండు షాపులను తెరించింది. అడిడాస్ ఢిల్లీ–ఎన్​సీఆర్​లో తన అతిపెద్ద ఎక్స్​పీరియన్స్​ స్టోర్​ను ఓపెన్​ చేసింది. జారా, నైక్,  అజోర్టే ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ స్టోర్లను ప్రారంభించాయి. ఇటలీకి చెందిన లావాజా,  అర్మానీ/కెఫే, యునైటెడ్ స్టేట్స్ నుంచి జాంబా,  ఆస్ట్రేలియాకు చెందిన ది కాఫీ క్లబ్ వంటి కొన్ని ప్రముఖ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు ఇండియాకు రాబోతున్నాయి.