అరబిందో ఫార్మాకు రూ.13 కోట్ల జీఎస్‌‌‌‌టీ నోటీస్‌‌‌‌

అరబిందో ఫార్మాకు రూ.13 కోట్ల జీఎస్‌‌‌‌టీ నోటీస్‌‌‌‌

న్యూఢిల్లీ:  అర్హత లేకపోయినా ఇన్‌‌‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ను క్లయిమ్‌‌‌‌ చేసినందుకు అరబిందో ఫార్మాకు రూ.13 కోట్ల ట్యాక్స్ నోటీసులను జీఎస్‌‌‌‌టీ అధికారులు పంపారు. ఇందులో వడ్డీ, పెనాల్టీ కలిసి ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2018–19 కి గాను ఈ నోటీసులు పంపారు. ఐటీసీని తిరిగి ఇవ్వాలని, రూ.6,54,50,645   పేమెంట్‌‌‌‌, రూ.5,92,20,900 వడ్డీ, రూ.65,51,354 పెనాల్టీ చెల్లించాలని  జీఎస్‌‌‌‌టీ హైదరాబాద్‌‌‌‌, పంజాగుట్ట డివిజన్ అరబిందో ఫార్మాకి నోటీసులను ఇష్యూ చేసింది. ఈ నోటీసుల ప్రభావం కంపెనీ కార్యకలాపాలపై, ఆర్థిక పరిస్థితిపై ఉండదని అరబిందో ఫార్మా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో వివరించింది.  కంపెనీ  షేర్లు శుక్రవారం  0.81 శాతం నష్టపోయి రూ.1,147 దగ్గర సెటిలయ్యాయి. 

యూఎస్‌‌‌‌లో డాక్టర్ రెడ్డీస్‌‌‌‌ కొత్త మందు

బ్యాక్టీరియల్ ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వాడే జెనరిక్ మెడిసిన్‌‌‌‌ను యూఎస్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో లాంచ్ చేశామని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ హైదరాబార్ కంపెనీ డోక్సీసైక్లైన్‌‌‌‌ క్యాప్సుల్స్‌‌‌‌ (40 ఎంజీ) ను అమెరికాలో లాంచ్ చేసింది. ఒరాసియా క్యాప్సుల్స్ (40 ఎంజీ) కు ఇది జనరిక్ వెర్షన్‌‌‌‌. డాక్టర్ రెడ్డీస్ షేర్లు శుక్రవారం 0.71 శాతం పెరిగి రూ.6,333 దగ్గర సెటిలయ్యాయి.