జూబ్లీహిల్స్లో పెరిగిన ఓటింగ్ శాతం.. సాయంత్రం 6 గంటల వరకు ఎంత జరిగిందంటే..

జూబ్లీహిల్స్లో పెరిగిన ఓటింగ్ శాతం.. సాయంత్రం 6 గంటల వరకు ఎంత జరిగిందంటే..

జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉప ఎన్నికలో సాయంత్రం 6 గంటల వరకు 48.42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఆరు గంటలకు ఓటింగ్ పూర్తవగా.. అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో లైన్లలో నిలిచిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 

2023 జనరల్ ఎలక్షన్స్ తో పోల్చితే జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం పెరిగింది. 2023 ఎన్నికల్లో ఇక్కడ 47.58 వాతం నమోదైంది. ఈ సారి దాదాపు ఒక శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది.

జూబ్లీహిల్స్ లో పోలింగ్ ముగియటంతో గేట్లు మూసివేశారు అధికారులు.  సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు స్లోగా సాగిన పోలింగ్.. ఆరు గంటల తర్వాత కాస్త పెరిగింది. దీంతో 48.42 శాతం పోలింగ్ నమోదైంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా 2025 నవంబర్ 11న ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం స్లోగా ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పెరిగింది. ఆ తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. మధ్యా్హ్నం 3 గంటలకు 40.2 శాతం ఉన్న పోలింగ్.. సాయంత్రానికి 47.16 శాతానికి చేరుకుంది. 

జూబ్లీహిల్స్‌‌ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగింది.​ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.