IND vs AUS: ప్రతీకార పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్య

IND vs AUS: ప్రతీకార పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్య

వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు కురిసే అవకాశం ఉండటంతో సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

తుది జట్లు

భారత జ‌ట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ. 

ఆస్ట్రేలియా జ‌ట్టు: మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్/కెప్టెన్‌), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంగా.