IND vs AUS Final: నిలకడగా ఆడుతున్న హెడ్, లబుషేన్.. వికెట్ కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు

IND vs AUS Final: నిలకడగా ఆడుతున్న హెడ్, లబుషేన్.. వికెట్ కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు

భారత్‌ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో ఆసీస్‌ విజయం దిశగా సాగుతోంది. 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను ట్రావిస్ హెడ్(71 నాటౌట్; 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్), లబుషేన్(34 నాటౌట్; 61 బంతుల్లో 2 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 101 (120 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతానికి ఆసీస్ 27 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్‌.. 3 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఇక కంగారూల విజయానికి కావాల్సింది 23 ఓవర్లలో 93 పరుగులే.

వికెట్ల కోసం భారత్ ఎదురుచూపులు

ట్రావిస్ హెడ్, లబుషేన్ జోడీని విడగొట్టడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జడేజా, కుల్దీప్ బౌలింగ్ లో ఆచి తూచి ఆడుతున్న ఈ జోడి వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తోన్న లక్ష మంది అభిమానులు నిరాశగా కనిపిస్తున్నారు.