IND vs SA: మరికొన్ని గంటల్లో స‌ఫారీల‌తో పోరు.. ఫ్రీగా మ్యాచ్‌లు ఇలా చూడండి

IND vs SA: మరికొన్ని గంటల్లో స‌ఫారీల‌తో పోరు.. ఫ్రీగా మ్యాచ్‌లు ఇలా చూడండి

సొంతగడ్డపై ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత జట్టు.. స‌ఫారీల‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నేటి నుంచి దక్షిణాఫ్రికా సిరీస్ మొదలుకానుంది. ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ తలపడనున్న టీమిండియా.. మొదట టీ20లతో వేట షురూ చేయనుంది. ఆదివారం (డిసెంబర్ 10) ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ తరుణంలో ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ చూడాలి అనేది తెలుసుకుందాం..

దక్షిణాఫ్రికా పిచ్‌లు పేసర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్లు రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ గైర్హాజరీతో టీ20 జట్టుకు మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్‌ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌‌ను చక్కగా ఉపయోగించుకోవాలని కుర్రాళ్లు ఆశిస్తున్నారు.

మ్యాచ్ ఎక్కడ చూడాలంటే..?

భారత్ - దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ వేదికగా జరుగనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. అలాగే, డిజిటల్‌గా డిస్నీ+ హాట్ స్టార్ (Disney+ Hotstar) యాప్ లో మ్యాచ్ ను వీక్షించవచ్చు. ఇది కేవలం మొబైల్ వినియోగదారులు మాత్రమే గమనించగలరు.

జట్లు(అంచనా)

టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండీ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షంషీ.