IND vs SA 2nd T20I: భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికా

IND vs SA 2nd T20I: భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన దక్షిణాఫ్రికా

టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో దక్షిణాఫ్రికా సారథి ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. డ్యూ ఫ్యాక్టర్, వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతో తొలుత బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. 

భారత కెప్టెన్ సూర్యకుమారర్ యాదవ్ మాట్లాడుతూ.. ఏది ఎంచుకోవాలని దానిపై తాము అయోమయంలో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు మొదట బ్యాటింగ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. అనారోగ్యం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు.

తుది జట్లు

టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆండీ ఫెహ్లుక్వాయో,మార్కో జెన్ సెన్, గెరాల్డ్ కోయెట్జీ, లిజార్డ్ విలియమ్స్, తబ్రైజ్ షంషీ.