IND vs SA: జైస్వాల్, సూర్య హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా భారత్

IND vs SA:  జైస్వాల్, సూర్య హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా భారత్

ద‌క్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడ‌ర్‌ పోరులో భారత బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా య‌శ‌స్వీ జైస్వాల్(58; 38 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్య‌కుమార్ యాద‌వ్(57; 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‍లు) జోడి పరుగుల వరద పారిస్తున్నారు. కీల మ్యాచ్‌లో వీరిద్దరూ అర్ధ శతకాలు బాదారు. దీంతో టీమిండియా 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

మొదట ద‌క్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు భారత జట్టుకు శుభ్‌మ‌న్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. నాండ్రే బర్గర్ వేసిన తొలి ఓవ‌ర్లోనే మూడు ఫోర్లు బాదాడు. అనంతరం మార్క్రామ్ వేసిన రెండో ఓవ‌ర్లో  జైస్వాల్ 4,4, 6 బాదాడు. దీంతో తొలి రెండు ఓవ‌ర్లోనే 29 పరుగులు వచ్చాయి. అయితే.. కేశ‌వ్ మ‌హారాజ్ మూడో ఓవ‌ర్లో వ‌రుస బంతుల్లో డేంజ‌రస్ గిల్(12), తిల‌క్ వ‌ర్మ‌(0)ను ఔట్ చేశాడు. అనంతరం సూర్య- జైస్వాల్ జోడి భారత ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు.